తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం

  • తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం
  • లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో స్తంభించిన జనజీవనం
  • కరీంనగర్, సిద్దిపేట, జనగామ, ములుగు జిల్లాల్లో వర్ష ప్రభావం
తెలంగాణలోని పలు జిల్లాలలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాన కారణంగా అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు పట్టణాలు, గ్రామాల్లో రహదారులపై వర్షపు నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో సాధారణ జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది.

జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌, కరీంనగర్ పట్టణం, హుజూరాబాద్‌, సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలతో పాటు ములుగు జిల్లాలోని మల్లంపల్లి, వెంకటాపూర్‌, ములుగు మండలాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. పలుచోట్ల రోడ్లు వాగులను తలపించడంతో రాకపోకలకు తీవ్ర  ఇబ్బందులు తలెత్తాయి.

Telangana
Heavy Rains
Telangana Weather Update
Karimnagar Rains
Siddipet Weather
Jangaon Rain

More Telugu News